![]() |
![]() |

బుల్లితెర మీద కార్తీక దీపం సీరియల్ ఆడియన్స్ ని ఎంతలా ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిందో అందరికీ తెలుసు. ఇందులో నటించిన నిరుపమ్ అలియాస్ కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు పేరు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఐతే నిరుపమ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. ఐతే కార్తీక దీపం సీరియల్ కి ఫస్ట్ ఛాయస్ కార్తిక్ కాదట. ఐతే అప్పటికే కుంకుమ అనే సీరియల్ చేస్తున్నాడట నిరుపమ్. "ఆ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్. ఈ కార్తీక దీపం ప్రొడ్యూసర్ కి ఆల్రెడీ మూగమనసులు అనే సీరియల్ చేసాను. ఐతే కార్తీక దీపం సీరియల్ తీస్తున్నారని తెలిసింది. కానీ అప్పటికే మా టీవిలో ఉన్నా కానీ ఆ సీరియల్ కి కూడా నన్నే పెట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి నన్ను అడగలేదు కానీ ఈ సీరియల్ గురించి డిస్కస్ చేశారు. ఎవరైనా హీరోలుంటే చెప్పండి అని అడిగారు. నేను కూడా ఇద్దరినీ పంపించా. వాళ్లకు స్క్రీన్ టెస్టులు ఆడిషన్స్ చేశారు. కానీ ఎవరూ సెలెక్ట్ కాకపోతున్నప్పుడు నా పేరు మళ్ళీ వచ్చింది. కుంకుమ పువ్వులో చేస్తున్నా కూడా కార్తీక దీపం సీరియల్ కి సూట్ అవుతాడని చెప్పి ఒప్పించారు దాంతో నేను అనుకోకుండా ఈ సీరియల్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. చంద్రముఖిలో నా పేరు కార్తీక కార్తీక దీపంలో కూడా నా పేరు కార్తీక్ . బయట ఎవరైనా కార్తీక్ అనే పిలుస్తారు ఆ పేరే సూటయ్యింది అంటారు. ఎందుకో ఆ పేరే కలిసొచ్చింది.
మలయాళంలో ఈ సీరియల్ బాగా సక్సెస్ అయ్యింది. ఐతే అందులో నాలుగు తెలుపు అమ్మాయిలు అనే కాన్సెప్ట్ తీసుకుని మన నేటివిటీకి తగ్గట్టు రాసుకున్నాం. సినిమా సెలబ్రిటీస్ కూడా ఈ సీరియల్ మీద పోస్టులు పెట్టడం వలన కూడా ఈ సీరియల్ బాగా వైరల్ అయింది. లక్ష్మి మంచి, వెన్నెల కిషోర్ వంటి సెలబ్రిటీస్ కూడా వాళ్ళ మూవీస్ లో ఈ సీరియల్ డైలాగ్స్ ని చెప్పేసరికి కూడా ఈ సీరియల్ ఆడియన్స్ లోకి బాగా వెళ్ళింది.
![]() |
![]() |